![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -377 లో... ఫణీంద్ర, సుశీల ఇద్దరు రామలక్ష్మి గురించి టెన్షన్ పడుతుంటారు. అప్పుడే రామలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది. జరిగిందంతా చెప్పి బాధపడుతుంది. అయ్యో ఇంత చిన్నప్పుడే బాబుకి ఎంత కష్టం పెట్టాడని సుశీల బాధపడుతుంది. రామలక్ష్మి మాత్రం తను కోరిన కోరికకి ఎటు తెల్చుకోలేకపోతుంది.
మరొకవైపు శ్రీలత, సందీప్ ఇద్దరు రామ్ మాట్లాడిన మాటల గురించి డిస్కషన్ చేసుకుంటారు. ఇంతవరకు రామ్ ఏది అడిగినా కూడ సీతాకాంత్ కాదనలేదు.. ఇప్పుడు ఆ మైథిలీని పెళ్లి చేసుకోవాలని కోరాడు కానీ సీతా ఆలోచనలో పడ్డాడని శ్రీలత అంటుంది. అడిగింది ఇవ్వడానికి వస్తువు కాదు కదా ఒక అమ్మాయి మనసు అని సందీప్ అంటాడు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. నేను ఒకటి అబ్జర్వ్ చేసానని శ్రీవల్లి అంటుంది. ఏంటని వాళ్ళు అడుగుతారు. ఇక సీతా బావ మైథిలీని పెళ్లి చేసుకుంటే మనకి మాములుగా ఉండదంటూ తన మాటలతో శ్రీలత, సందీప్ లకి చిరాకు తెప్పిస్తుంది.
ఆ తర్వాత రామ్ దగ్గరికి సీతాకాంత్ వస్తాడు. సీతా నేను చెప్పిన దానికి మిస్ ఒప్పుకుందా అని అడుగుతాడు. డాక్టర్ పక్కనే ఉండి బాబుని ఎక్కువ స్ట్రెయిన్ చెయ్యొద్దని అంటుంది. మేం చెప్పినట్టు వింటే నువ్వు చెప్పింది చేస్తామని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటాడు. అసలు తను రామలక్ష్మి కాదు ఒకవేళ అయితే రామ్ ఇలా బాధపడుతుంటే చూడలేదని అనుకుంటాడు. మరొకవైపు రామలక్ష్మి కూడా రామ్ గురించి బాధపడుతుంది.
మరుసటి రోజు రామ్ డ్రాయింగ్ చేస్తాడు. సీతాకాంత్ వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఇది మిస్.. నువ్వు .. మధ్యలో నేను అని రామ్ అనగానే.. సీతాకాంత్ షాక్ అవుతాడు. మా మిస్ కి ఫోన్ చేస్తానంటూ సీతాకాంత్ దగ్గర ఫోన్ తీసుకొని రామలక్ష్మికి రామ్ కాల్ చేస్తాడు. ఆ ఫోన్ కాల్ చూసి సీతా సర్ చేస్తున్నాడు.. ఒకవేళ నేను ఎమోషనల్ అయితే నేనే రామలక్ష్మి అని తెలుస్తుంది. ఇప్పుడు లిఫ్ట్ చెయ్యకపోతే రామ్ ఎలా ఉన్నాడో నాకు తెలియదని రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. రామ్ ఫోన్ చేసి అత్త అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |